హైదరాబాద్ లో జేపీ మోర్గాన్ కొత్త ఆఫీసు

హైదరాబాద్ లో జేపీ మోర్గాన్ కొత్త ఆఫీసు
  • ఆసియా ఫసిపిఖ్ దేశాల్లో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాదే

హైదరాబాద్: సిటీలో మరో అంతర్జాతీయ సంస్థ కాలు మోపింది. ఆసియా పసిఫిక్‌ దేశాల్లో అతిపెద్ద క్యాంపస్ ను జేపీ మోర్గాన్‌ హైదరాబాద్‌లో ప్రారంభించింది. హైటెక్‌సిటీలోని సాలార్‌పురియా సత్వా నాలెడ్జ్‌ సిటీలో సుమారు  8 లక్షల 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఆఫీసు ఏర్పాటు చేసింది. తన ఉద్యోగులకు ప్రపంచ స్థాయి పని వాతావరణాన్ని అందించడానికి ప్రజలు మరియు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. కీ ఫైనాన్షియల్.. టెక్నాలజీ హబ్ గా హైదరాబాద్ క్యాంపస్ ను ఉపయోగించుకోనుంది.  
హైదరాబాద్‌లో ఉన్న టెక్నాలజీ, రిస్క్‌, ఆపరేషన్స్‌, ఇతర విభాగాలన్నీ ఇప్పుడు ఒకే చోట నుంచి పనిచేయనున్నాయని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కమర్షియల్ బ్యాంకింగ్ మరియు గ్లోబల్ సర్వీసెస్ హెడ్, జేపీ మోర్గాన్ చేజ్ తెలిపారు. భారత్‌లో తమ కార్యకలాపాలకు హైదరాబాద్‌ ఎంతో కీలకంగా ఉందని జేపీ మోర్గాన్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ హెడ్‌ డేనియల్‌ విల్కెనింగ్‌ పేర్కొన్నారు. పూర్తిగా అధునాతనంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆఫీస్‌ను ఏర్పాటు చేశామని భారత్ తోపాటు ఫిలిప్పీన్స్ దేశాలలోని జేపీ మోర్గాన్ చేజ్ కార్పొరేట్ కేంద్రాల సీఈఓ దీపక్ మంగ్లా తెలిపారు.