11 మందితో పార్లమెంటరీ బోర్డు

11 మందితో పార్లమెంటరీ బోర్డు
  • ప్రకటించిన బీజేపీ జాతీయ​ అధ్యక్షుడు జేపీ నడ్డా
  • రెండు కమిటీల్లో కె. లక్ష్మణ్​కు చోటు
  • నితిన్​ గడ్కరీ, శివరాజ్​సింగ్​ చౌహాన్​ పేర్లు తొలగింపు

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీలో కీలకమైన పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ప్రకటించారు. పార్లమెంటరీ బోర్డులో 11 మందికి చోటు కల్పించారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీని 15 మందితో ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి ఎంపీ కె.లక్ష్మణ్‌‌కు రెండింటిలోనూ చోటు దక్కింది. ఇప్పటి వరకు ఉన్న పార్లమెంట్​ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ, మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ను తొలగించారు. 

ఇదీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు 


అధ్యక్షుడు : బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సభ్యులు : ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు అమిత్‌‌ షా, రాజ్‌‌నాథ్‌‌ సింగ్‌‌, ఎంపీ కె.లక్ష్మణ్‌‌, సీనియర్ నేతలు బీఎస్‌‌ యడియూరప్ప, శర్బానంద సోనోవాల్‌‌, ఇక్బాల్‌‌ లాల్‌‌పుర, సుధా యాదవ్‌‌, సత్యనారాయణ జటియా, బీఎల్‌‌ సంతోష్‌‌. వీరిలో బీఎస్ యడియూరప్ప, శర్బానంద సోనోవాల్, కె. లక్షణ్‌‌, ఇక్బాల్​ లాల్​పుర, సుధా యాదవ్​, సత్యనారాయణ జటియాకు కొత్తగా చోటు దక్కింది. ఇక్బాల్​ లాల్​పురను తీసుకోవడం ద్వారా సిక్కు కమ్యూనిటీకి తొలిసారి బోర్డులో అవకాశం కల్పించినట్లయింది. పంజాబ్​కు చెందిన రిటైర్డ్​ ఐపీఎస్​ అధికారి ఇక్బాల్​ లాల్​పుర.. ప్రస్తుతం నేషనల్​ మైనారిటీస్​ కమిషన్​ చైర్మన్​గా ఉన్నారు. 

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ: 
పార్లమెంటరీ బోర్డులోని 11 మందితోపాటు కొత్తగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మయూర్, వనతి శ్రీనివాస్​తో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.