9 రాష్ట్రాల్లో గెలిచేందుకు బీజేపీ వ్యూహాలు

9 రాష్ట్రాల్లో గెలిచేందుకు బీజేపీ వ్యూహాలు

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2023లో జరగబోయే 9 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు బీజేపీకి చాలా కీలకమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. 9 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఏ ఒక్క చోట కూడా బీజేపీ ఓటమి చెందకుండా వ్యూహరచన చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందిందని చెప్పారు. మోడీ హయాంలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలిపారు. మొబైల్​ఫోన్ల తయారీలో భారత్ రెండో స్థానంలో, ఆటోమొబైల్​రంగంలో మూడో అతి పెద్ద తయారీదారుగా ఉందన్నారు. 

సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. పేదలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని జేపీ నడ్డా అన్నారు. గుజరాత్​అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని సాధించిందని చెప్పారు. 182 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 150కి పైగా సీట్లు గెలవడం అసాధారణమైన విజయమని కొనియాడారు. హిమాచల్​ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైనా.. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఓట్ల తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువే అని జేపీ నడ్డా చెప్పారు.