
నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా బుధవారం ( మే 28 ) హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. అనంతరం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి పార్వతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ కు మరణం లేదని.. దేశంలో ఏ పార్టీ వచ్చిన ఆయన పేరు స్మరించకుండా ఉండలేరని అన్నారు. ఎన్టీఆర్ పాలన రామ రాజ్యం గా విలసిల్లిందని.. ఇప్పుడు రామ రాజ్యం లో రాక్షస రాజ్యం నడుస్తుందని అన్నారు.
అప్పుడు రావణాసురుని రాముడు చంపాడు..కానీ ఇప్పుడు రాముణ్ణి రావణాసురుడు చంపేశాడని అన్నారు లక్ష్మి పార్వతి. ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని.. వారు తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు ఎన్టీఆర్ కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా మనసంతా మహానాడు మీద ఉన్నా కానీ అక్కడకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు.
ఆ లోటును ఇక్కడ ఆ మనుభావునికి నివాళులు అర్పిస్తు తీర్చుకున్నానని అన్నారు. చిన్నతనం నుండి ఎన్టీఆర్ పాటను కానీ, వీడియో లను కానీ చూడకుండా నాకు ఒక్క రోజు కూడా ఉండదని అన్నారు రఘురామ.ఆయన రికార్డులకు ఎవరు దరిదాపులకు కూడా రారని...9 నెలల్లో ముఖ్యమంత్రి కావటం.. 40 సంవత్సరాలు పూర్తి కావడం మామూలు విషయం కాదని అన్నారు.
ఎన్టీఆర్ మా అందరికీ స్ఫూర్తి అని.. ఎక్కడ తెలుగు వారు ఉన్న అందరూ మాట్లాడుకునే పదం ఎన్టీఆర్ అని అన్నారు. మరణం లేని జననం ఎవరికైనా ఉంది అంటే అది ఒక్క ఎన్టీఆర్ కే అని అన్నారు రఘురామ.