
మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Ntr) అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ సక్సెస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. 'ది కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్' అంటూ దేవర ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ను మేకర్స్ వెల్లడించారు.
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లు సాధించినట్లు అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. మాస్ హిస్టీరియాను మీ దగ్గరలోని సినిమాల్లో చూడండి.. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లోను దూసుకెళ్తోంది అని వెల్లడించారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన దేవర దేశవ్యాప్తంగా రూ.77 కోట్లకి పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇండియాలో వచ్చిన కలెక్షన్లలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా రూ.68 కోట్లుకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :- హీరోయిన్ సమంతకు అరుదైన గౌరవం
ఈ రూ.77 కోట్ల కలెక్షన్స్‌లలో తెలుగు నుంచి రూ.68.6 కోట్లు, హిందీ నుంచి రూ.7 కోట్లు, కన్నడ నుంచి రూ. 30 లక్షలు, తమిళం ద్వారా రూ. 80 లక్షలు, మళయాళం వెర్షన్‌లో రూ. 30 లక్షలు వచ్చాయి. అలాగే, దేవర పార్ట్-1కు శుక్రవారం 79.56 శాతం తెలుగులో థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది.
అయితే.. దేవర సినిమాకి పలుచోట్ల మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినప్పటికీ..వరల్డ్ వైడ్ గా టాప్ డే 1 వసూళ్లలో నిలిచింది. ఒకపరంగా చూసుకుంటే ఇది గ్రాండ్ ఓపెనింగ్ అయినప్పటికీ.. ప్రభాస్ కల్కి 2898 AD మూవీ కంటే తక్కువే. కాగా కల్కి మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.191.5 కోట్లు రాబట్టింది. ఇక ఈ వీకెండ్ లో దేవర మరింత థియేటర్ ఆక్యుపెన్సీ నమోదై అవకాశం ఉంది.
THE KING OF OPENINGS IS BACK with a BANG!! ??
— NTR Arts (@NTRArtsOfficial) September 28, 2024
MAN OF MASSES @Tarak9999 shakes the world with ??? ??????+ ???? ?? ??? ? ??#Devara #BlockbusterDevara#KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @anirudhofficial@NANDAMURIKALYAN @RathnaveluDop @sabucyril… pic.twitter.com/vWkCEwxR5m