Jr NTR: ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

Jr NTR: ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్

ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు నందమూరి తారక రామారావు (NTR) జయంతి నేడు (మే28). తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే సీనియర్ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 

 ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెవి మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ఎన్టీఆర్ Xలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఇవాళ ఉదయం హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. సీనియర్ ఎన్టీఆర్ నటవారసత్వాన్ని పునికిపుచ్చుకున్న తారక్ ప్రేమ పట్ల నందమూరి ఫ్యాన్స్ ప్రేమను వ్యక్తపరుస్తూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సినీ, రాజకీయ రంగాలలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అన్నీ రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇకపోతే, విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన రామారావు, తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో 13 చారిత్రికాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు చేసాడు.

1968 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. 1978 లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు 'కళాప్రపూర్ణ ' స్వీకరించాడు. ఇలాంటి మహోన్నతమైన నట, రాజకీయ సేవకుడికి భారతరత్న ఇవ్వాలని తెలుగునాట అందరూ డిమాండ్ చేస్తున్నారు.