
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రతలో ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. 2023 ఆగస్టు 22 మంగళవారం రోజున లోకేష్ గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా ఫ్యూచర్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఎన్టీఆర్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీ వైరల్ గా మారింది.
కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం రంగన్నగూడెంలోఈ ఫ్లెక్సీలు వెలిశాయి. “యువగళమైన.. జనగళమైన.. నవగళమైన.. ఏ గళమైనా తెలుగు నాట స్మరించే పేరు ఒక్కటే.. నందమూరి తారకరామారావు” అని ఈ ఫ్లెక్స్ లో పేర్కొన్నారు.
కాగా లోకేశ్ తమ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని హాజరుకాకపోవడం గమనార్హం. అంతకుముందు “అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే” అంటూ ఒంగోలులో ఇప్పటికే ఒక భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేశారు ఏన్టీఆర్ ఫ్యా్న్స్