ఎన్టీఆర్ చిత్రాలకు గ్లోబల్‌వైడ్‌గా పాపులారిటీ రావడంతో తన క్రేజ్ బాలీవుడ్‌లో మరింత పెరిగింది. ఇటీవల ‘దేవర’ చిత్రంతో ఇండియన్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ రికార్డులు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆయన హిందీలో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్2’ చిత్రంలో నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్‌ఎంటర్‌టైనర్‌కు అయాన్‌ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. శనివారం ఈ మూవీ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ భారీ సెట్‌లో యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. ఎన్టీఆర్ కూడా ఈ షెడ్యూల్‌లో జాయిన్ అవుతున్నాడు.
పదిరోజుల పాటు జరగనున్న షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఇక నవంబర్ ఫస్ట్ వీక్‌లో క్లైమాక్స్‌ను షూట్ చేయడానికి ప్లాన్ చేశారట. దీని కోసం ఎన్టీఆర్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్పై యూనివర్స్‌లో ఏజెంట్ కబీర్ పాత్రలో హృతిక్ నటిస్తున్నాడు. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించటం ఖాయమంటున్నారు మేకర్స్. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 2025 ఆగస్టు 14న సినిమా రిలీజ్ కానుంది.