తారక్.. విత్ త్రీ డైరెక్టర్స్!

తారక్.. విత్ త్రీ డైరెక్టర్స్!

ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత అతడు చేయబోయే సినిమా గురించి అందరిలోనూ ఆసక్తి ఉంది. దానికి కారణం ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించడమే.ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత  తారక్, త్రివిక్రమ్​ల కాంబోలో ఓ సినిమా రానుందనే వార్త చాలా రోజులుగా వినిపిస్తోంది. దాంతో అందరూ అదే ఫిక్స్ అనుకున్నారు. అయితే అంతలోనే ‘కేజీఎఫ్’ డైరెక్టర్  ప్రశాంత్ నీల్ పేరు తెర మీదికొచ్చింది. మొదట ప్రశాంత్ డైరెక్షన్‌లో మహేష్‌ నటిస్తాడనే వార్తలు వచ్చినా, ఆ తర్వాత తారక్‌కి ఫిక్సయ్యాడు అన్నారు. దాని విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడేమో ‘అసురన్’ ఫేమ్ వెట్రిమారన్ సీన్లోకి ఎంటరయ్యాడు. జాతీయ అవార్డును సైతం అందుకున్న వెట్రిమారన్‌ ఓ అదిరిపోయే కథ చెప్పాడని, తారక్ ఇంప్రెస్ అయ్యాడని టాలీవుడ్​లో చెప్పుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ తన తర్వాతి సినిమాను ఏ దర్శకుడితో ఎటువంటి సబ్జెక్ట్​తో  చేస్తాడోననే క్యూరియాసిటీ అభిమానుల్లో ఎంతగా ఉందో అర్థమవుతోంది. వెట్రిమారన్​ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తారని, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీని మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తారని,  త్రివిక్రమ్ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనుందని ప్రచారం జరుగుతోంది. దాంతో ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరి సినిమా ముందు సెట్స్ పై​కి వెళ్లనుందనే దానిపై టాలీవుడ్​లో చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ వార్తల్లో ఏది నిజమో, ఏదైనా నిజముందో లేక అన్నీ పుకార్లో అనేది తారక్ అయినా తేల్చి చెబితే బాగుణ్ను.