ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ 30కి మూహుర్తం ఫిక్స్

ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ 30కి మూహుర్తం ఫిక్స్

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు దేశవ్యాప్తంగానే కాక విదేశాల్లోనూ సూపర్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో అతని నుండి రాబోయే నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతోందా అనే అంచనాలు కూడా పెరుగుతున్నాయి. కొరటాల శివ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో 30వ చిత్రం. నిజానికి ఇప్పటికే సెట్స్‌‌‌‌పైకి వెళ్లాల్సి ఉంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’తో పెరిగిన ఎన్టీఆర్ ఇమేజ్‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని స్క్రిప్ట్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవడంతో ఆలస్యమైనట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవడంతో త్వరలో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. ఫిబ్రవరి సెకెండ్‌‌‌‌ వీక్‌‌‌‌లో ఓపెనింగ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌ను గ్రాండ్‌‌‌‌గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌తో పాటు రాజమౌళి ఫ్యామిలీ, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ మొత్తం ప్రారంభానికి హాజరవబోతున్నారట. ముఖ్య​అతిథిగా చిరంజీవిని ఆహ్వానించబోతున్నారని టాక్. కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రత్నవేలు, సాబు సిరిల్, శ్రీకర ప్రసాద్ లాంటి ప్రముఖ టెక్నీషియన్స్‌‌‌‌ వర్క్ చేస్తున్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో అనౌన్స్ చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌‌‌‌లో రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.