ఎన్టీఆర్ లగ్జరీ వాచ్.. ధర రూ. 2.5 కోట్లు

ఎన్టీఆర్ లగ్జరీ వాచ్.. ధర రూ. 2.5 కోట్లు

జూనియర్​ ఎన్టీఆర్​ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్​ నుంచి నాటు నాటు సాంగ్​ ఆస్కార్​‌‌కు నామినేట్​ అయిన నేపథ్యంలో రాజమౌళి అండ్​ కో బృందం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కొన్ని గంటల్లో అవార్డుల ప్రకటనకు సంబంధించి అనౌన్స్ మెంట్​ రానుంది. కాగా జూనియర్​ ఎన్టీఆర్​ ధరించిన పటెక్​ఫిలిప్​ వాచ్​ సోషల్​మీడియాలో వైరల్​అయ్యింది. ఈ కంపెనీకి చెందిన ప్రొడక్ట్స్, లగ్జరీ వాచ్​ల ధరలు అధికంగా ఉంటాయి. అయితే ఎన్టీఆర్​ ధరించిన చేతి వాచ్​ మన కరెన్సీలో సుమారుగా రూ. 2.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.

ఇక అమెరికాలో ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ సందడి అంతాఇంతా కాదు. అటు రామ్ చరణ్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ నాటు నాటు పాటకు ప్రచారం కల్పించేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నారు. టీవీ షోల్లో పాల్గొంటూ నాటు నాటు పాటను ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చెర్రీ తారక్ వేస్తున్న ఔట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఎంతో ఆకట్టుకుంటోంది.