RRR అప్ డేట్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

RRR అప్ డేట్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఆర్ఆర్ఆర్ నుంచి మరో అప్డేట్  వచ్చేసింది. ఇన్ని రోజులు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ ను మొదలు పెట్టింది యూనిట్. షూటింగ్ ఎలా స్టార్ట్ చేశామనే దానిపై  ట్విట్టర్లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. విశ్రాంతి, రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకొస్తున్నాం #WeRRR back !! అని పోస్ట్ చేసింది.  ఒక నిమిషం  ఉన్న ఈ వీడియోలో ఫిల్మ్ సెట్స్ క్లీన్ చేయటం, నటీనటుల డ్రెస్సులు , షూటింగ్ లొకేషన్‌లో  టెంపరేచర్ ను చెక్ చేస్తున్నారు.

ఈ మూవీలో రామ్ చరణ్ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ ఇప్పటికే ఓ వీడియోను రిలీజ్ చేశారు కానీ ఎన్టీఆర్ కు సంబందించింది రిలీజ్ చేయలేదు. అయితే  అక్టోబర్ 22న  జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ‘రామరాజు ఫర్ భీమ్‘ ను  రిలీజ్ చేస్తామని టీం వెల్లడించింది.

రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురంభీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. అజయ్ దేవ్ గన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ ,ఎన్టీఆర్ లకు జోడీగా ఆలియా భట్ ,ఓలివియా మోరిస్ నటిస్తున్నారు.