ఈవీల కోసం రూ.40 వేల కోట్లు .. ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందం

ఈవీల కోసం రూ.40 వేల కోట్లు .. ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందం
  • ఇన్వెస్ట్​ చేయనున్న జేఎస్​డబ్ల్యూ గ్రూప్ 

న్యూఢిల్లీ:  జేఎస్​డబ్ల్యూ గ్రూప్ రూ. 40 వేల కోట్ల పెట్టుబడితో  ఎలక్ట్రిక్స్​ వెహికల్స్​(ఈవీ) ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు  ఒడిశా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.   ఈ ప్రాజెక్ట్ ద్వారా జేఎస్​డబ్ల్యూ గ్రూప్ ఆటోమొబైల్ రంగంలోకి ప్రవేశిస్తోంది.  ఈ కంపెనీకి స్టీల్, ఎనర్జీ, సిమెంట్, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, పెయింట్స్, వెంచర్లు,  స్పోర్ట్స్ వంటి వ్యాపారాలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)  ఈవీ బ్యాటరీ తయారీ కోసం ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నామని, కటక్,  పారాదీప్​లో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపింది.

ఫలితంగా 11 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 50 గిగావాట్​అవర్​ ఈవీ బ్యాటరీ ప్లాంట్, ఈవీలు, లిథియం రిఫైనరీ, కాపర్ స్మెల్టర్  సంబంధిత కాంపోనెంట్ తయారీ యూనిట్లు ఉంటాయి. శనివారం జరిగిన ఎంఓయూ సంతకాల కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి ప్రతాప్ కేసరీ దేవ్, జేఎస్​డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్,  ఒడిశా ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.