జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేట నుంచి వచ్చి డబ్బులు పంచిన్రు..మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో   సిరిసిల్ల, సిద్దిపేట నుంచి వచ్చి డబ్బులు పంచిన్రు..మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్

జూబ్లీహిల్స్ , వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల నుంచి వచ్చిన బీఆర్​ఎస్ ​లీడర్లు.. ఇక్కడి ఓటర్లకు డబ్బులు పంచి ప్రలోభ పెట్టారని, అయినా అంతిమ విజయం కాంగ్రెస్​దే అని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. ఇతర జిల్లాల నుంచి వందల సంఖ్యలో బీఆర్ఎస్​ లీడర్లు, కార్యకర్తలు నియోజకవర్గంలో ప్రవేశించి తిష్ట వేశారన్నారు. నోట్లు కట్టలు వెదజల్లి ఓటర్లను కొనే ప్రయత్నం చేశారన్నారు. అయితే, ఓటర్లు మాత్రం వారు మెచ్చిన, నచ్చిన నవీన్​యాదవ్​కే ఓట్లు వేశారన్నారు. నిబంధనలను తుంగలో తొక్కి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు అక్కడక్కడా బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యాలు జరిగాయన్నారు.