
ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో రైల్వేస్టేషన్ ప్రారంభమైంది. అమీర్ పేట్ హైటెక్ సిటీ రూట్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రోస్టేషన్ సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణాలతో రైల్వేస్టేషన్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ స్టేషన్ ప్రారంభంతో నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో అన్ని స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫిల్మ్‌నగర్, జర్నలిస్టుకాలనీ, నందగిరిహిల్స్, తారకరామనగర్, దీన్‌దయాల్‌నగర్, గాయత్రీహిల్స్, కేబీఆర్‌పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మెట్రో రైలు సేవలు కొనసాగనున్నాయి.