మహబూబాబాద్ జిల్లాలో సినీ రేంజ్‎లో ఛేజింగ్.. దొంగలను వెంటాడి పట్టుకున్నరు

మహబూబాబాద్ జిల్లాలో సినీ రేంజ్‎లో ఛేజింగ్.. దొంగలను వెంటాడి పట్టుకున్నరు

తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో మహిళ మెడలో నుంచి బంగారం గొలుసు లాక్కెళ్లగా, పోలీసులు, గ్రామస్తులు వెంబడించి నిందితులను పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మాటేడు గ్రామానికి చెందిన ముత్యం ప్రేమలీల ఉదయం 7 గంటల ప్రాంతంలో రోడ్డుపై కోతులను తరుముతుండగా, ఇద్దరు వ్యక్తులు ఆమెతో మాటలు కలిపి అదును చూసి మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును లాక్కొని సూర్యాపేట వైపు పారిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, పోలీసులు 40 కిలోమీటర్లు వెంబడించి మద్దిరాల సమీపంలో పట్టుకున్నారు. తొర్రూరు పోలీస్ స్టేషన్‌‌కు వారిని తీసుకొచ్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గొల్లమూడి ఉపేందర్  తెలిపారు.