జన్వాడలో మంచు లక్ష్మి సందడి

జన్వాడలో మంచు లక్ష్మి సందడి
  • బాలికలకు  శానిటరీ ప్యాడ్స్ పంపిణీ
  • స్మార్ట్ క్లాస్​రూమ్‌లు ఏర్పాటుకు హామీ

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా జన్వాడలోని ప్రభుత్వ స్కూల్లో ‘టీచ్ ఫర్ చేంజ్’, ‘వేని రావు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో సినీ నటి మంచు లక్ష్మి బాలికలకు శానిటరీ ప్యాడ్స్, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ కార్యకమ్రానికి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై మాట్లాడారు. డిజిటల్ స్మార్ట్ క్లాస్​రూమ్ ఏర్పాటుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల ఆరోగ్యం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం కృషి చేస్తున్నట్లు మంచు లక్ష్మి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 45 స్మార్ట్ క్లాస్​రూమ్‌లు ఏర్పాటు చేశామని, జన్వాడలో మరో 2 ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంఈవో అక్బర్, ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.