
ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల మాల స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో 1997 ఆగస్టు 11న ట్యాంక్ బండ్ పై ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన మాల అమరవీరులకు ఓయూలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావు మాట్లాడుతూ.. ట్యాంక్ బండ్ పై దాడిలో నలుగురు మాలల మరణానికి అప్పటి సీఎం చంద్రబాబు కారణమన్నారు.
మాల అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మాల సంఘాల జేఏసీ గౌరవ చైర్మన్ చెరుకు రామచంద్రం, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరే బాలకిషన్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఉదయ్, డాక్టర్ వీరస్వామి పాల్గొన్నారు.