
బెంగళూరు: కర్నాటక సహకార శాఖ మంత్రి కేఎన్. రాజన్న తన మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీ కారణంగానే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగళూరులోని మహదేవపుర సెగ్మెంట్లో లక్ష మందికి పైగా బోగస్ ఓటర్లు ఓటేశారని.. రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలకు రాజన్న మద్దతుగా మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగానే ఈ అవకతవకలు జరిగాయని రాజన్న విమర్శించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉండడంతో పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది.