ట్రాక్టర్ ఢీకొని చిన్నారి మృతి

ట్రాక్టర్ ఢీకొని  చిన్నారి మృతి

ఇబ్రహీంపట్నం, వెలుగు: గ్రామ పంచాయతీకి చెందిన చెత్త ట్రాక్టర్ ఢీకొనడంతో మూడేండ్ల చిన్నారి చనిపోయింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లికి చెందిన వన్నాడపు భీరప్ప, మానస దంపతుల రెండో కుమార్తె అవంతిక(3) సోమవారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ సమయంలో  చెత్త సేకరణకు వచ్చిన  ట్రాక్టర్ చిన్నారిని ఢీకొట్టడంతో ఆమె స్పాట్ లోనే మృతి చెందింది.  గ్రీన్​ ఫార్మా సిటీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

టిప్పర్ ఢీకొని మరొకరు..

గండిపేట: స్కూటీపై వెళుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొనడంతో స్పాట్ లోనే మృతిచెందాడు.  సరూర్‌నగర్‌ కు చెందిన జంగయ్య (42) తన యాక్టివా పై నార్సింగి రోటరీ–1 ప్రాంతానికి వచ్చాడు. టిప్పర్‌ డ్రైవర్ నారాయణ,  జంగయ్య బైక్‌ను ఢీకొట్టాడు.  జంగయ్య రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై స్పాట్ లోనే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియా మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.