
- ప్రైవేట్ ఎంప్లాయి అరెస్ట్
- 77 గ్రాముల గోల్డ్సీజ్
పద్మారావునగర్, వెలుగు: జల్సాలకు అలవాటు పడి, చైన్ స్నాచింగ్స్చేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. కాకినాడకు చెందిన కోరుప్రోలు లవరాజు (23) రెండేండ్లుగా జీడిమెట్లలోని హెటిరో ల్యాబ్స్‌లో జూనియర్ కెమిస్ట్‌గా పనిచేస్తున్నాడు. మద్యం, ఆన్లైన్ బెట్టింగ్‌కు బానిసై, జీతం డబ్బులు సరిపోక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల నుంచి చైన్ స్నాచింగ్చేస్తున్నాడు. ఇటీవల సింహపురి, గౌతమి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో చైన్ దొంగతనాలు చేశాడు.
సోమవారం ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, గతంలో పలు చైన్స్నాచింగ్స్చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.7.7 లక్షల విలువైన 77 గోల్డ్ ఆర్నమెంట్స్స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మూడు చైన్లు దొంగిలించి, రెండింటిని అమ్మిన నిందితుడు.. ఒకదానిని తాకట్టు పెట్టినట్లు తెలిపాడు.