జూబ్లీహిల్స్ ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ వచ్చింది.. ఎంత పెరిగిందంటే

జూబ్లీహిల్స్ ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ వచ్చింది.. ఎంత పెరిగిందంటే

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి ఫైనల్ పోలింగ్ పర్సెంటేజీని విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 2025 నవంబర్ 11వ తేదీన పోలింగ్ ముగియటంతో.. పూర్తి డేటా సేకరించి మొత్తం పోలింగ్ శాతం ఎంత నమోదైందో ప్రకటించారు. ఫైనల్ పోలింగ్ 48.49 శాతంగా నమోదైనట్లు పేర్కొన్నారు.

పోలింగ్ తేదీ రోజు సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఓటింగ్ శాతం 47.06 శాతంగా నమోదైంది. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగగా.. అప్పటికే బూత్ లలో లైన్లలో ఉన్న వాళ్లకు కూడా ఓటింగ్ వేసేందుకు అనుమతించారు. దీంతో ఫైనల్ పోలింగ్ వివరాలను వెల్లడించలేదు. 

ఆ తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించిన అధికారులు.. పూర్తి డేటా విశ్లేషించి ఫైనల్ పోలింగ్ శాతాన్ని 48.49 శాతంగా నమోదైనట్లు చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో 45.2 శాతం నమోదైన ఓటింగ్ శాతం.. బై ఎలక్షన్ లో దాదాపు 3 శాతానికి పైగా పెరిగింది. 

జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 4 లక్షల13 వందల 65 మంది ఓటర్లు ఉండగా.. 58 మంది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అందులో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్తిగా లంక దీపక్ రెడ్డి బరిలో దిగారు. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది.