- జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్
- ఫిలింనగర్ బతుకమ్మ సంబురాల్లో హైడ్రాకు వ్యతిరేకంగా నినాదాలు
పంజాగుట్ట, వెలుగు : బతుకమ్మ పండుగకు చీరలు పంచలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని జూబ్లీహిల్స్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విమర్శించారు. సంబురాలు పూర్తయిన వెంటనే హైడ్రా సంగతి చూస్తామని హెచ్చరించారు. ఫిలింనగర్ కొత్తచెరువు వద్ద బుధవారం నిర్వహించిన బతుకమ్మ సంబురంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్థానిక మహిళలు హైడ్రాకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ బతుకమ్మ ఆడారు. నాలా అభివృద్ధి పేరుతో తమ ఇండ్లు కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ముందు వాపోయారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పేదల ఇండ్లను ఎట్టిపరిస్థితిలో కూలగొట్టనివ్వనని చెప్పారు.