- భద్రాద్రికొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్
- డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువతను సైనికుల్లాగా తయారు చేయాలి
- కలెక్టర్జితేశ్ వి పాటిల్
- ‘చైతన్యం–డ్రగ్స్‌పై యుద్ధం’ ముగింపు సందర్భంగా ర్యాలీ
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : డ్రగ్స్ తయారీ, సప్లై, అమ్మకం, వాడకంపై కఠిన శిక్షలున్నాయని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘చైతన్యం – డ్రగ్స్‌పై యుద్ధం’ ముగింపు ప్రోగ్రాం సందర్భంగా కొత్తగూడెంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం నగరంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ తయారీ, సప్లై, అమ్మకం, వాడకాలపై నేరం రుజువైతే కఠిన కారాగార శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం న్యాయవ్యవస్థ ఎప్పుడూ పోలీస్‌లకు, ప్రజలకు అండగా ఉంటుందన్నారు.
కలెక్టర్ జితేశ్మాట్లాడుతూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యువతను సైనికుల్లాగా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ లేని సమాజం రూపొందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. డ్రగ్స్‌పై పోలీస్‌లకు ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్స్ బారిన పడిన వారికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎస్పీ బి. రోహిత్ రాజు మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణలో పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
గంజాయి అక్రమ రవాణా కట్టడి విషయంలో జిల్లా పోలీసులు అద్భుత ప్రతిభ చూపుతున్నారన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొనడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఈ ప్రోగ్రాంలో డీఎఫ్ఓ కృష్ణాగౌడ్, అడిషనల్ ఎస్పీ నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆర్టీఓ వెంకటరమణ, ఎక్సైజ్‌సూపరింటెండెంట్ జానయ్య, మున్సిపల్‌కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డీఎస్పీలు రెహమాన్, చంద్రభాను, రవీందర్ రెడ్డి, సతీశ్ కుమార్, మల్లయ్య స్వామి, అశోక్, సత్యనారాయణ పాల్గొన్నారు.
