
నిర్మల్, వెలుగు: కోర్టు మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ఉన్న ఓ దివ్యాంగురాలి వాంగ్మూలాన్ని ఆమె కూర్చున్న కారు వద్దకే వచ్చి నమోదు చేశారు నిర్మల్ జడ్జి. వివరాలిలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి ప్రధాన సాక్షి అయిన సాధు ఇందిరమ్మ మంగళవారం సాక్ష్యం ఇచ్చేందుకు నిర్మల్ కోర్టుకు వచ్చింది.
సాక్షి దివ్యాంగురాలు అని పోలీసుల ద్వారా తెలుసుకున్న ప్రిన్సిపల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రవీందర్, ఏపీపీ దేవేందర్ తో కలిసి కారు వద్దకే వచ్చారు. న్యాయవాదుల సమక్షంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.