యువత  డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : వి.శివనాయక్

యువత  డ్రగ్స్ కు దూరంగా ఉండాలి :  వి.శివనాయక్

భద్రాచలం, వెలుగు: యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని భద్రాచలం ఫస్ట్ క్లాస్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్​ వి.శివనాయక్​ పిలుపునిచ్చారు. పట్టణంలోని దక్షిత డీ అడిక్షన్​ సెంటర్​లో శనివారం నిర్వహించిన న్యాయసదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టాలని సూచించారు. కార్యక్రమంలో భద్రాచలం బార్ అసోషియేషన్​ సీనియర్​ న్యాయవాదులు పేరాల వెంకటేశ్వర్లు, పడిసిరి శ్రీనివాసరావు, పామరాజు తిరుమలరావు, పట్టణ ఎస్సై శ్యాం ప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు.