
‘చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుం ది’, ‘చట్టం ముందు అందరూ సమానులే’ ‘చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు’, ‘చట్టం తప్పు చేసిన వారిని శిక్షిస్తుం ది’ ఈ డైలాగులు మనం చాలాసార్లే విని ఉంటాం . అయితే.. కొన్ని దేశాల్లో కఠినంగా అమలు చేసే చట్టాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మన దగ్గర అవి లేవు కాబట్టి విచిత్రంగానే ఉన్నప్పటికీ అక్కడి పరిస్థితుల కారణంగా ఆ చట్టాలు ఏర్పాటు చేసుకొని ఉండవచ్చు. ఇంతకీ ఆ చట్టాలేంటో చూద్దామా!
ఈత కొట్టడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుం ది. బాడీకి మంచి ఎక్సర్ సైజు కూడా. అయితే.. ఫ్రాన్స్ లో ఈత కొట్టేటప్పుడు మాత్రం బిగుతుగా ఉండే దుస్తులే ధరిం చాలి. వదులుగా ఉన్న దుస్తులు ధరిం చి ఈత కొడితే.. అక్కడి చట్టాల రీత్యా నేరంగా పరిగణిస్తారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా వేషభాషలు మారుతున్నాయి. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వస్త్రధారణ పెద్దగా పట్టించుకోరు కదా! అయితే.. సుడాన్ లో , నార్త్ కొరియాలో మహిళలు ప్యాంట్లు ధరిం చకూడదు. ఈ చట్టం 2014 నుం చి అక్కడ కఠినంగా అమలు పరుస్తున్నారు. గతంలో ఒకసారి తొమ్మిది మంది మహిళలు ఈ చట్టాన్ని ఉల్లం ఘిస్తే వారిని కఠినంగా శిక్షించారు.
సుడాన్ లో పురుషులు మేకప్ వేసుకోవడం నేరం. ఓ ప్రైవేట్ పార్టీలో 67 మంది యువకులు మేకప్ వేసుకున్నందుకుగానూ.. సుడాన్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. మేకప్ వేసుకోవడం వల్ల పురుషుల్లో ఆడవారి లక్షణాలు పెరుగుతాయి. ఫలితంగా హిజ్రా కల్చర్ పెరుగుతుందన్న అభిప్రాయంతో ఈ చట్టం అక్కడ కఠినంగా అమలు పరుస్తున్నారు.
మామూలుగా ఇంట్లోంచి బయటకువస్తే.. స్లిప్పర్స్ వేసుకొని వస్తాం. ఇలా స్పెయిన్ లో కూడా చేశారనుకోండి.. మీరు శిక్షార్హు లవుతారు. అవును.. వినడానికి ఇది విచిత్రంగా ఉన్నా.. ఫ్లిప్ –ఫ్లాప్స్ ధరించి బయట ఎక్కడైనా కనిపిస్తే.. ఫైన్ విధిస్తారు.కాళ్లు బయటకు కనిపిం చకూడదు అనే చట్టాన్ని వాళ్లు తూ.చ తప్పకుండా పాటిస్తారు.
చారిత్రక ప్రదేశాలకు వెళ్లడమంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుం ది. అయితే.. అక్కడికి వెళ్లేటప్పుడు ఎలాం టి ఫుట్ వేర్ ధరించాలో కూడా ఓ ఐడియా ఉండాలి. మనదేశంలో అలాంటి నియమాలేం లేకపోయినా.. గ్రీస్ లో ఉన్నాయి. అక్కడ చారిత్రక ప్రదేశంలో సంచరిం చేటప్పుడు హైహీల్స్ వేసుకోకూడదు. పురాతన ఆనవాళ్లను హైహీల్స్ దెబ్బతీస్తాయన్న కారణంతో, చారిత్రక, పురాతన ప్రదేశాల పరిరక్షణ కోసం ఈ చట్టం చేశారక్కడ.
మినీస్కర్ట్ ధరించడం ఇప్పుడు సినిమాల్లో ఫ్యాషన్ . బాగా డబ్బున్నవాళ్లు మొదలుకొని మోస్తరు మధ్య తరగతి అమ్మాయిలు కూడా పలు సందర్భాల్లో మినీ స్కర్ట్ ధరించి హొయలు పోతుంటారు. అయితే.. ఉగాండాలో పబ్లిక్ ప్లేస్ లో మినీస్కర్ట్ ధరిస్తే.. అరదండాలే. యాంటీ పోర్నోగ్రఫీ చట్టం కింద అక్కడ మినీస్కర్ట్ని నిషేధించారు.
కువైట్ లో ఆడవాళ్లలా మగవాళ్లు, మగవాళ్లలా ఆడవాళ్లు ప్రవర్తిం చకూడదు. అలా ప్రవర్తిస్తే ముందూ, వెనకా ఆలోచించకుండా తీసుకెళ్లి జైల్లో వేసి ఊచలు లెక్కపెట్టిస్తా రు. 2007లో ఈ చట్టాన్ని అతిక్రమిం చిన 14 మందిని అరెస్టు చేసి చట్టరీత్యా శిక్ష విధించారు.
కొన్ని ప్రాంతాల్లో ప్రత్యే కమైన సందర్భాల్లో మాత్రమే సంప్రదాయ దుస్తులకు ప్రాధాన్యత ఇస్తారు. భూటాన్ దేశ ప్రజలు సంప్రదాయాలను పాటించడంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అందుకే.. భూటాన్ మహిళలు ఇంటినుంచి బయటకు వెళ్లినప్పుడు వారి సంప్రదాయ దుస్తులైన కిమానో, కైరా అనే డ్రెస్సును తప్పకుండా ధరించాలి. ఈ 17వ శతాబ్దం నుంచి వాళ్లు ఫాలో అవుతున్నారు. ఒకవేళ అలా ధరించకుండా నలుగురిలోకి వస్తే వారికి జరిమానాతో పాటు శిక్ష విధిస్తారు.