
సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సిద్ధమయ్యారు తహశీల్దార్లు. ఈ నెల 9 నుంచి వర్క్ టు రూల్ తో పాటు.. 15 నుంచి సామూహిక సెలవులకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్ లోని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిష్ట్రేషన్ ఆవరణలో తెలంగాణ తహశీల్దార్ల అసోసియేషన్ కార్యవర్గం అత్యవసర సమావేశం జరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా తహశీల్దారులు ఎదుర్కొనే సమస్యలపై చర్చించారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుండటంతో.. ఆందోళన బాట పట్టాలని తీర్మానించారు. ఎన్నికల సమయంలో బదిలీ చేసిన తహశీల్డార్ లను తిరిగి అదే స్థానంలో నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.