జూన్ 20న హెల్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ సదస్సు.. బ్రోచర్ ఆవిష్కరించిన నిమ్స్ డైరెక్టర్ 

జూన్ 20న హెల్త్ అండ్ ఎన్విరాన్ మెంట్ సదస్సు.. బ్రోచర్ ఆవిష్కరించిన నిమ్స్ డైరెక్టర్ 

పంజాగుట్ట, వెలుగు: నగరంలో పర్యావరణ అనుకూల ఆరోగ్య సేవలపై అవగాహన పెంచే లక్ష్యంగా ‘హెల్త్ అండ్ ఎన్విరాన్​మెంట్ లీడర్​షిప్ ప్లాట్​ఫాం’  ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. బీరప్ప తెలిపారు.

మంగళవారం నిమ్స్ ఆస్పత్రిలోని సమావేశ మందిరంలో ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్​ను ఆయన ఆవిష్కరించారు. జూన్ 20న హైటెక్ సిటీలోని యశోదా ఆస్పత్రిలో నిర్వహించనున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వైద్య నిపుణులు హాజరై పర్యావరణ పరిరక్షణతో కూడిన వైద్య విధానాలపై చర్చించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్​షిప్ ప్లాట్‌‌ఫాం అధ్యక్షుడు డా. లింగయ్య, తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు డా. మార్తా రమేశ్ పాల్గొన్నారు.