జూన్ 4న జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం టూర్ : గుడ్డెం దొడ్డి దగ్గరే హెలిప్యాడ్..

జూన్ 4న  జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం టూర్ : గుడ్డెం దొడ్డి దగ్గరే  హెలిప్యాడ్..
  •   సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే

గద్వాల, వెలుగు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన స్థలాలను మార్పు చేసినట్లు జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. మంగళవారం పర్యటన ఏర్పాట్లను ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. 

సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా సీఎం హెలిప్యాడ్ ను జూరాల దగ్గర ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల దానిని మార్పు చేసినట్లు తెలిపారు. ఈనెల 4న సీఎం గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ను పరిశీలిస్తారన్నారు. 

అక్కడే హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హెలిప్యాడ్ నుంచి పంప్ హౌస్ కి వెళ్లే దారిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర వివరాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ ఆఫీసర్లకు సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శంకర్, ఇరిగేషన్ ఎస్సీ రహీముద్దీన్, ఆర్డీవో శ్రీనివాసరావు, ఆర్ అండ్ బీ ఈఈ ప్రగతి పాల్గొన్నారు.