జూన్ లో నమోదైన డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు

జూన్ లో నమోదైన డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు

నెలనెలా పెరుగుతున్న సంఖ్య

మే తో పోలిస్తే 242 కేసులు అధికం

హైదరాబాద్, వెలుగు: డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య నెలనెలా పెరుగుతూపోతోంది. మే నెలతో పోల్చితే జూన్ లో 242 కేసులు పెరిగాయి.
మేలో ఈ సంఖ్య 2,294 ఉండగా జూన్ లో 2,536 కేసులు నమోదయ్యాయి. మందు తాగి పట్టుబడ్డ వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు నాంపల్లిలోని 3,4వ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. 340 మందికి ఒకరోజు నుంచి నెల రోజుల పాటు కోర్టు శిక్షలు విధించింది. 121 మంది డ్రైవింగ్ లైసెన్స్ లపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇందులో 39 డ్రైవింగ్ లైసెన్సులను మూడేళ్లు,10 లైసెన్సులను రెండేళ్లు, మరో 69 మంది లైసెన్సులను ఏడాదిన్నర పాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2,075 మందికి రూ.54,94,200 జరిమానాలును విధించింది.