అడవిలో జంగిల్ బుగీ రియాల్టీ షో

అడవిలో జంగిల్ బుగీ రియాల్టీ షో

క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో  జరిగింది.  ఈ రియాల్టీ షోలో తెలుగు లయన్స్, హిందీ హాక్స్, తమిళ్ టైగర్స్, మావెరిక్స్, కన్నడ పాంతర్స్ ఇలా ఐదు టీమ్స్ పాల్గొననున్నాయి.  ఈ నెల 17,18వ తేదీల్లో జరగబోయే ఆడిషన్స్ ద్వారా ఎంపికైన వారు 90 రోజుల పాటు అడవిలో ఉంటూ కార్యక్రమ నిర్వాహకులు సూచించే సాహసాలు చేయాల్సిఉంటుంది.  శనివారం జరిగిన జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్‌‌‌‌లో  డైరెక్టర్ యశోధర విక్రమ్ మాట్లాడుతూ ‘నేను దర్శకుడిగా, రైటర్‌‌‌‌‌‌‌‌గా కన్నడ చిత్ర పరిశ్రమలో పలు చిత్రాలు చేశాను.  ఈ కాన్సెప్ట్  నా మిత్రుడు వినోద్ ఇచ్చారు.

ఆయన గతంలో కొన్ని రియాల్టీ షోస్ చేశారు. కాన్సెప్ట్ విన్న తర్వాత ఇది చాలా కష్టమైన రియాల్టీ షో, ఛాలెంజింగ్‌‌‌‌గా ఉంటుందని అనిపించింది. ప్రముఖ ఛానెల్స్‌‌‌‌ను అప్రోచ్ అయ్యాం. పైలట్ ఎపిసోడ్ అడిగారు. త్వరలోనే వారి నుంచి అప్రూవల్ వస్తుంది’ అని చెప్పాడు. ఎపిక్ ప్రొడక్షన్స్ అధినేత పార్థసారథి,  జనరల్ క్రియేటివ్ టీమ్ రషీద్,  జంగిల్ బుగి టీమ్ మెంబర్ కమల,   దర్శక నిర్మాత ఘంటా శ్రీనివాస్ పాల్గొన్నారు.