తాతయ్య ఉత్సవాలకు వెళ్లడం లేదు : జూనియర్ ఎన్టీఆర్

తాతయ్య ఉత్సవాలకు వెళ్లడం లేదు : జూనియర్ ఎన్టీఆర్

మే 20న జరగనున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరుకాలేపోతున్నానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. మే 20 తన బర్త్ డే  కావడంతో.. కుటుంబ సభ్యు లు ముందస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేశారని, అందుకే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరుకాలేపోతున్నానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. 

తనను ఆహ్వానించిన సమయంలోనే ఆర్గనైజింగ్ కమిటీకి కూడా ఇదే విషయాన్ని తెలియజేసాను అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. కాగా ఎన్టీఆర్ ఈ ఉత్సవాలకు హాజరుకాకపోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఎన్టీఆర్ వస్తున్నట్లు ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం చేశారు నిర్వాహకులు. కూకట్ పల్లి ఏరియా మొత్తం జూనియర్ ఎన్టీఆర్ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఒకే వేదికపై బాబాయ్ బాలయ్య - అబ్బాయ్ ఎన్టీఆర్ ను చూడొచ్చన్న నందమూరి అభిమానుల ఆశ, కోరిక.. జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనతో ఆవిరి అయ్యింది.

మే 20 జూనియర్ ఎన్టీఆర్  కావడంతో ఆయనకు అభిమానులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.