
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నేత జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. శనివారం మాజీ ఎంపీ, పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి, కొల్లాపూర్ నియోజకవర్గ నేత జగదీశ్వర్రావుతో విడివిడిగా భేటీ అయ్యారు. వారి ఇంటికి వెళ్లి పార్టీలో చేరికపై చర్చించినట్టు తెలిసింది. 2 గం టలకుపైగా వారిద్దరితో సమావేశమైన ట్టు చెప్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నట్టు ప్రచా రం జరుగుతోంది. ఆయన కూడా మల్లు రవితో భేటీ అయి పార్టీలో చేరే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.