కేసీఆర్ ప్రభుత్వానికి మళ్లీ పాలించే నైతిక హక్కులేదు : జూపల్లి కృష్ణారావు

 కేసీఆర్ ప్రభుత్వానికి మళ్లీ పాలించే నైతిక హక్కులేదు : జూపల్లి కృష్ణారావు

కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి, అవినీతి ఆకాశానికి వెళ్లిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి మళ్లీ పాలించే నైతిక హక్కులేదన్నారు. ఢిల్లీలోని AICC కార్యలయంలో రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఉద్యమ ఆశయాలను బీఆర్ఎస్ నెరవేర్చడం లేదన్న జూపల్లి .. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షం ఉండొద్దని.. నియంతలా వ్యవహరించే వ్యక్తి మరోసారి అధికారంలోకి రావొద్దనే కాంగ్రెస్ లో చేరుతున్నామని జూపల్లి వెల్లడించారు తెలంగాణ ఇచ్చిన  కాంగ్రెస్, సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు.

తెలంగాణ ప్రజలను బీఆర్ఎస్ మోసం  చేసిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిఆరోపించారు. 9 ఏళ్ల పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికల్ బంధమన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తాయని చెప్పారు.  

ALSO READ:ప్లీజ్ నన్ను చంపొద్దు.. బతికే ఉన్నా : జబర్థస్త్ అప్పారావు

జులై2 న ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెడతామని చెప్పిన రేవంత్.. దీనికి రాహుల్ గాందీ హాజరు అవుతారని చెప్పారు.  జులై12 లేదా 14న మహబూబ్ నగర్ లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.