ప్లీజ్ నన్ను చంపొద్దు.. బతికే ఉన్నా : జబర్థస్త్ అప్పారావు

ప్లీజ్ నన్ను చంపొద్దు.. బతికే ఉన్నా : జబర్థస్త్ అప్పారావు

యూట్యూబ్ ఛానళ్స్ లో వస్తున్న న్యూస్ అండ్ రూమర్స్ పై జబర్దస్త్ కమేడియన్ అప్పారావు ఫుల్ ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్పారావు.. యూట్యూబ్‌ ఛానళ్ల వల్ల సినీ నటులు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ గురించి విస్తరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. యూట్యూబ్‌ వాళ్లందరూ తన మాటలు వినాలని.. ఈ అంశం మీద తానొక నాటిక రాద్దాం అనుకున్నానాని అన్నారు అప్పారావు. "యూట్యూబ్ నీకో దండం" అనే పేరుతో ఒక నాటకం రాసుకుందాం అనుకున్నానని, ఇది కొంచెం బాధతో చెబుతున్నానని అన్నారు అప్పారావు. 

ALSO READ:15 కిలోమీటర్ల ట్రాఫిక్ జాం.. హోటల్స్ లేవు.. తిండి లేదు.. ప్రయాణికుల నరకం

ఇక ఈ యూట్యూబ్ చానళ్ల గురించి మాట్లాడుతూ.. "ఈ యూట్యూబ్ వాళ్ళు సినీ నటీనటులు బతికి ఉండగానే చంపేస్తున్నారు. థంబ్‌ నైల్స్ ఇలా పెడితేనే చూస్తారు అనే ఆలోచనల్లో గనక మీరుంటే.. దయచేసి మీకో నమస్కారం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి. సోషల్‌ మీడియా ఇప్పుడు చాలా బలంగా ఉంది. అది నేను కూడా అంగీకరిస్తాను కానీ.. ఒక మనిషి బతికుండగా చనిపోయాడు అని చెప్పే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. అందరూ ఎదో ఒకరోజు చనిపోవాల్సిందే. ఇలాంటి వార్తలు రాసిన వారు కూడా చనిపోవాల్సిందే కానీ.. మీ వ్యూస్ కోసం దారుణమైన కాప్చన్స్‌ మాత్రం పెట్టకండి, మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేయకండి" అంటూ తన భాదను వ్యక్తం చేశారు అప్పారావు. ప్రస్తుతం అప్పారావు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.