ఆ ఎస్ఐలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతాం

ఆ ఎస్ఐలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతాం

కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి ఎస్ఐలతో పాటు కోడేరులో పని చేసిన ఎస్ఐలపైన చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో పోలీసుల ఆరాచకం హద్దులు దాటిందని విమర్శించారు. తెలంగాణ ద్రోహి చెప్పినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. 

నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన అరచకాలు, పోలీసులు రౌడీయిజాన్ని ఎస్ఐ, డీజీపీతో పాటు మహమూద్ అలీ, కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవని జూపల్లి కృష్ణరావు తెలిపారు. కొల్లాపూర్ లో ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.