ట్రిపుల్ ఐటీలో మంత్రి జూపల్లి బస

ట్రిపుల్ ఐటీలో మంత్రి జూపల్లి బస

నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీని జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో కలిసి రాత్రి సహపంక్తి భోజనం చేసి, అనంతరం ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల కష్టసుఖాలు తెలుసుకునేందుకే వచ్చానని, బోధన, మౌలిక సదుపాయాలపై సమస్యలు ఉంటే నిర్భయంగా చెప్పాలని మంత్రి సూచించారు. తాగునీరు, హాస్టల్ గదుల నిర్వహణ, విద్యా ప్రమాణాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.