
చందమామ, గురుగ్రహం(జుపిటర్) ఒకదానికొకటి ఇలా దగ్గరగా వచ్చి ఆకాశంలో కనువిందు చేస్తున్నాయి. ‘చంద్ర, గురు గ్రహ కూటమి’గా పిలిచే ఈ దృశ్యంలో చంద్రుడికి పైభాగంలో చిన్న చుక్కలా జుపిటర్ మెరుస్తూ కనిపిస్తోంది. బుధవారం హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ లో రాత్రి 7.10 గంటలకు తీసిన ఈ ఫొటోను ప్లానెటరీ సొసైటీ ఇండియా రిలీజ్ చేసింది. గురువారం కూడా సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో పశ్చిమ దిక్కున ఈ దృశ్యాన్ని చూడొచ్చని ఆ సంస్థ తెలిపింది. - హైదరాబాద్, వెలుగు