
జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్లు తెర్చుకున్నాయి. ఈ ఉదయం ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి కిందకు నీళ్లు వదిలారు అధికారులు. ఉదయం 1లక్ష 67వేల 370 క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగింది.
జూరాల ప్రాజెక్టులో 318.420 మీటర్ల నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్టు కెపాసిటీ 9.459 టీఎంసీలు. ప్రాజెక్టుకు 1 లక్షా 50వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో నిలకడగా కొనసాగుతోంది.