రాముడిని లక్ష్మణుడిలా.. నువ్వు నన్ను గౌరవించాలి ..తేజస్వీకి ఆర్జే డీ బహిష్కృత నేత ..తేజ్ ప్రతాప్ సూచన

రాముడిని లక్ష్మణుడిలా.. నువ్వు నన్ను గౌరవించాలి ..తేజస్వీకి ఆర్జే డీ బహిష్కృత నేత ..తేజ్ ప్రతాప్  సూచన

పాట్నా: రాముడిని లక్ష్మణుడు గౌరవించినట్టుగానే తమ్ముడు తేజస్వీ యాదవ్ తనను గౌరవించాలని ఆర్జేడీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్ సూచించారు. ఆర్జేడీలో ఉన్నప్పుడు తన సన్నిహితులను రెబల్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలబెట్టేవారని తేజస్వి చేసిన ఆరోపణలపై తేజ్ ప్రతాప్ స్పందించారు. 

‘‘రాముడిని లక్ష్మణుడు గౌరవించినట్టుగానే తేజస్వీ యాదవ్ నాతో గౌరవంగా వ్యవహరించాలి. అతడు కొంతమంది మాటలు విని తప్పుదారి పడుతున్నారు” అని తెలిపారు. తేజస్వి ప్రాతినిధ్యం వహిస్తున్న రాఘోపూర్ సీటుకు సమీపంలోని మహువా నియోజకవర్గం నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని తేజ్ ప్రతాప్ యాదవ్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలపై కూడా ఆయన మాట్లాడారు. ‘‘స్వాతంత్ర్యోద్యమంలో ఆర్ఎస్ఎస్ ఎటువంటి పాత్ర పోషించలేదు. మేం మహత్మా గాంధీ అనుచరులం” అని చెప్పారు.