పేరులో గాంధీ తగిలించుకోగానే గాంధీ కాలేవు

పేరులో గాంధీ తగిలించుకోగానే గాంధీ కాలేవు
  • రాహుల్ గాంధీపై ఫడ్నవిస్ ఆగ్రహం

భారత్ బచావో సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు రాహుల్ సావర్కర్ కాదు.. రాహుల్ గాంధీ అంటూ ఆయన అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. వీర్ సావర్కర్ గురించి రాహుల్ కి ఏమాత్రం తెలియదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోందని అన్నారు ఫడ్నవిస్. స్వాతంత్ర్య పోరాట సమయంలో సావర్కర్ 12 ఏళ్ల పాటు అండమాన్ జైలులో చిత్రహింసలు అనుభవించారని తెలిపారు. రాహుల్ గాంధీ నాటి పరిస్థితులను కేవలం 12 గంటలకు కూడా ఫేస్ చేయలేరని అన్నారు ఫడ్నవిస్. పేరు చివరిలో గాంధీ అని తగిలించుకోగానే, గాంధీ అయిపోలేరని రాహుల్ కు చురకలంటించారు.

కాగా, మోడీ ప్రభుత్వ విధానాలపై నిరసనగా కాంగ్రెస్ పార్టీ.. భారత్ బచావో పేరుతో ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తాను రాహుల్ సావర్కర్ ను కాదని.. రాహుల్ గాంధీని అని అన్నారు. సిటిజన్ షిప్ చట్ట సవరణ వల్ల దేశంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు. ఇదిలా ఉండగా, రేప్‌ ఇండియా వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని, ప్రధాని మోడీ, అమిత్‌షాలే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నోట్ల రద్దుతో ప్రజలు కోలుకోలేనంత పెద్ద దెబ్బ కొట్టారని ఆయన అన్నారు. పేదల జేబుల్లోని డబ్బులు లాక్కుని పెద్దవాళ్లకు మోడీ పంచిపెట్టారని రాహుల్‌ అన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదు కానీ, పెద్దవారికి వేలకోట్ల రూపాయిల బకాయిలు మాఫీ చేశారని ఆయన అన్నారు. మోడీ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తిన్నదని ఆయన అన్నారు.

MORE NEWS:

‘మోడీ ఉంటే.. ఈ సమస్యలు కామన్’

మోడీ, షాలే క్షమాపణ చెప్పాలి: రాహుల్