ఆ ముగ్గురూ చెలరేగితే అఫ్గాన్‌దే గెలుపు

ఆ ముగ్గురూ చెలరేగితే అఫ్గాన్‌దే గెలుపు

దాయాది పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడి సెమీఫైనల్ అవకాశాలను కష్టతరం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ఓ అద్భుతాన్ని ఆశిస్తోంది. ఆ అద్భుతం అఫ్గానిస్థాన్ టీమ్ చేయాలని, తమను సెమీస్‌కు చేర్చాలని చూస్తోంది. ఒకవేళ ఆదివారం కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో అఫ్గాన్ నెగ్గితే భారత్‌కు సెమీస్ దారి క్లియర్ అవుతుంది. సోమవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో భారీ విజయం సాధిస్తే కోహ్లీసేన నాకౌట్ చేరుకుంటుంది. కాబట్టి కోట్లాది మంది భారతీయ అభిమానులు అఫ్గాన్ గెలవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌ మ్యాచ్‌పై లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ముగ్గురు ప్లేయర్లు రాణిస్తే అఫ్గాన్‌కు తిరుగుండదని అన్నాడు. 

‘అఫ్గాన్ టీమ్‌లో కీలక ఆటగాళ్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్ ఒకడు. అతడు గాయం నుంచి కోలుకుని ఫిట్‌గా ఉండాలి. న్యూజిలాండ్‌‌‌తో ఆడుతున్నప్పుడు ముజీబ్ లాంటి మిస్టరీ స్పిన్నర్ జట్టులో ఉంటే అది అదనపు బలంగా మారుతంది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీకి తోడుగా ముజీబ్ టీమ్‌లో ఉంటే వాళ్లు మ్యాజిక్ చేయగలరు. ముజీబ్ చాలా ముఖ్యమైన ఆటగాడు. అతడు వరుణ్ చక్రవర్తి వంటి స్పిన్నర్. అలాగే అనుభవం కూడా ఉండటం అతడికి కలిసొస్తుంది. రషీద్‌, ముజీబ్ చెలరేగితే ఎంతటి బ్యాట్స్‌మన్‌ను అయినా కట్టడి చేయొచ్చు’ అని గవాస్కర్ చెప్పాడు. 

మరిన్ని వార్తల కోసం: 

ఇరాక్ ప్రధానిపై హత్యాయత్నం

కష్టపడి ఎదిగా.. కామెంట్స్​ పట్టించుకోను

కారు ఫోటో తీసిన కానిస్టేబుల్​పై టీఆర్ఎస్ ​లీడర్ రుబాబ్