కష్టపడి ఎదిగా.. కామెంట్స్​ పట్టించుకోను

కష్టపడి ఎదిగా.. కామెంట్స్​ పట్టించుకోను

అందంగా ఉంటుంది. అద్భుతంగా నటిస్తుంది.సరదాగా కబుర్లు చెబుతుంది.సీరియస్ విషయాలపై తనకు తానుగా స్టాండ్ తీసుకుంటుంది.నటిగానే కాదు.. వ్యక్తిగానూ తాను ప్రత్యేకమేనని ప్రూవ్ చేస్తున్న పూజాహెగ్డేతో వెలుగు ఎక్స్​క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

‘మోస్ట్ ఎలిజిబుల్‌‌‌‌ బ్యాచ్‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌’తో మళ్లీ హిట్ కొట్టారుగా?

అవును. వరుస హిట్లు వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇందులోని విభా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ నాకు చాలా కాంప్లిమెంట్స్ తెచ్చిపెట్టింది.

అన్నీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్. క్రేజీ రోల్స్. అలాంటివే వెతుక్కుంటూ వస్తున్నాయా లేక వచ్చిన వాటిలో అలాంటి వాటిని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారా?
లేదు. అదృష్టం కొద్దీ నా దగ్గరకు అన్నీ మంచి ప్రాజెక్ట్సే వస్తున్నాయి. ఇప్పుడు చేస్తున్న రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ చిత్రాలతో పాటు లైన్‌‌‌‌లో ఉన్న సినిమాలన్నీ నన్ను వెతుక్కుంటూ వచ్చినవే.

ఒకప్పుడు సావిత్రి గారి డేట్స్ కోసం హీరోలు వెయిట్ చేసేవారట. ఇప్పుడు మీకోసం చేయాల్సి వస్తోందంటున్నారు?

అమ్మో.. అది చాలా పెద్ద మాట. నా మీద అభిమానంతో కొందరు అలా అంటున్నారు. బిజీగా ఉన్నమాట వాస్తవమే. అయితే నేను నటిగా ఇంకా బేబీనే. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను. సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.  

ఇటు సౌత్‌‌‌‌లోను, అటు నార్త్​లోను కూడా నటిస్తున్నారు. ఏది ఎక్కువ కంఫర్టబుల్?

అలా చెప్పలేను. ప్రతి చోటూ డిఫరెంట్. ప్రతి భాషా డిఫరెంట్. ప్రతి కథ డిఫరెంట్. ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్. తీసే డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ని బట్టి సినిమా ఉంటుంది. ఆ టీమ్‌‌‌‌ని బట్టి అక్కడి వాతావరణం ఉంటుంది. ఉదాహరణకి త్రివిక్రమ్, హరీష్ శంకర్‌‌‌‌‌‌‌‌లాంటి కొందరు డైరెక్టర్స్‌‌‌‌ చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అలాంటి వారితో పని చేయడం చాలా బావుంటుంది. అలాగే కోలీవుడ్, బాలీవుడ్‌‌‌‌లలో కూడా. 

కానీ తెలుగు ప్రేక్షకులే మిమ్మల్ని ఎక్కువ ఓన్‌‌‌‌ చేసుకున్నారు కదా?

అది మాత్రం వాస్తవం. తెలుగు ఆడియెన్స్ ప్రేమ చాలా గొప్పది. ఒక్కసారి ప్రేమించారంటే ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటారు. వాళ్ల వల్లే నేనిక్కడ ఉన్నాను.  తెలుగు నేర్చుకున్నాను. తెలుగమ్మాయిగా మారిపోయాను. దేశంలో ఎక్కడికి వెళ్లినా నన్ను బుట్టబొమ్మ అని పిలుస్తున్నారంటే అది తెలుగు సినిమాల వల్లే కదా. అందుకే నాకు తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా హైదరాబాద్‌‌‌‌ వస్తే నా సొంతూరికే వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. నేను ఇక్కడిదాన్నే అనిపిస్తుంది. గొప్ప ఇన్​ఫ్రాస్ట్రక్చర్, అంతకంటే గొప్ప వ్యక్తులు ఉన్న ప్లేస్ ఇది. 

తెలుగు కల్చర్‌‌‌‌‌‌‌‌లో మీకు నచ్చేదేంటి?

పేరెంట్స్ పెంపకం. అవును. నేను బేసిగ్గా కన్నడ అమ్మాయిని. మా కల్చర్​కి తెలుగు కల్చర్​కి చాలా పోలికలు ఉంటాయి. మా ఇంట్లో పూర్తిగా అదే కల్చర్ ఉంటుంది. మన పేరెంట్స్ మనల్ని పెంచిన విధానం చూస్తేనే మన కల్చర్ ఎంత గొప్పదో అర్థమవుతుంది. వాళ్లు నేర్పిన విలువలు, చెప్పిన పాఠాలే ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టాయని నేను నమ్ముతాను. 

మరి మీలో మీకు నచ్చేదేంటి? నచ్చనిదేంటి?

ఆ రెండింటికీ ఆన్సర్ ఒకటే. నేను బాగా వర్క్ హాలిక్. ఎంత పనైనా చేస్తాను. అలసట, విసుగు ఉండవు. మొదటి నుంచి చివరి వరకు అదే కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌తో ఉంటాను. అయితే పనిలో పడితే ఇంకేమీ పట్టించుకోను. నాకోసం నేను టైమ్ కేటాయించుకోవడం మర్చిపోతాను. సరదాగా గడపడానికి, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి కూడా టైమ్ కావాలి కదా. అందుకే నా పనితీరే నా ప్లస్సూ మైనస్సూ అని చెప్తా.

సెలెబ్రిటీగా ఉండటంలో కష్టమైన పార్ట్ ఏంటి?

సెలెబ్రిటీలు ఎవరినైనా ఈజీగా ఇన్‌‌‌‌ఫ్లుయెన్స్ చేయగలరు.  ప్రతి ఒక్కరి కళ్లు మన మీదే ఉంటాయి. కాబట్టి మనం చేసే పనుల ప్రభావం వారిమీద ఉంటుంది. వీళ్లు చేసే మంచి పనులు వారిని మోటివేట్ చేస్తాయి. ఇన్‌‌‌‌స్పైర్ చేస్తాయి. అయితే ఈ ఫాలోయింగ్ వల్ల నష్టం కూడా ఉంది. కొందరు ప్రతిదాన్నీ ఎక్కువగా స్క్రూటినీ చేస్తుంటారు. లిమిట్ దాటి ఇన్‌‌‌‌వాల్వ్ అయిపోతారు.  కామెంట్స్​ చేస్తారు. ఆ నెగిటివిటీని ఫేస్​ చేయడం కంటే కష్టమైన పని మరొకటి ఉండదు.

స్టార్ అయ్యాక మీవల్ల ఇబ్బందులు వస్తున్నాయంటూ ఈమధ్య ఒక డైరెక్టర్ కామెంట్ చేశారు. అందులో నిజమెంత?

ఈ స్టేటస్ నాకు ఒక్క రోజులో వచ్చింది కాదు. ఎంతో  కష్టపడి ఇమేజ్‌‌‌‌ని, క్రేజ్​ని సంపాదించాను. బాగా నటిస్తాను. ఒప్పుకున్న పాత్ర కోసం ఎంత కష్టమైనా పడతాను. అవన్నీ రాయరు. నెగిటివ్​గా ప్రచారం చేయడానికి మాత్రం చాలా ఉత్సాహపడతారు. అసలు ఆ వ్యక్తి అన్నది నిజమైతే నాకిన్ని అవకాశాలొస్తాయా? త్రివిక్రమ్‌‌‌‌ గారితో మూడో సినిమా చేయబోతున్నాను. హరీష్ శంకర్‌‌‌‌‌‌‌‌ గారితోనూ మూడోసారి పని చేయబోతున్నాను. దిల్ రాజు గారు, హారిక హాసిని సంస్థవారు నాకు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే నేనేంటో వారికి తెలుసు. నా గురించి పూర్తిగా తెలియనివారెవరో ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. 

సోషల్ ఇష్యూస్‌‌‌‌పై స్పందిస్తారు. సర్వీస్ చేస్తున్నారు. స్ఫూర్తి ఏంటి?

నా పుట్టినరోజుకి నా ఫ్యాన్స్ అన్నదానం చేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్స్​కి హెల్ప్ చేస్తున్నారు. నాకోసం వాళ్లు అంత చేస్తున్నప్పుడు నేనెంత చేయాలి అనుకుంటూ ఉంటాను. నిజానికి సోషల్ సర్వీస్ చేయాలనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచీ ఉంది. ఈ సమాజం మనకి ఎంతో ఇస్తుంది. మనం కూడా ఎంతో కొంత తిరిగివ్వాలి కదా. అలా ఇచ్చినవారి గురించి వింటున్నప్పుడు ఏదో ఒకరోజు నేనూ అలా చేయాలి అనిపించేది. ఇప్పుడు చేయగలిగే స్థాయిలో ఉన్నాను. అలా అని ఏవో చిన్న చిన్న సాయాలు చేయడం కాదు.. ఓ సంస్థను స్థాపించి కాస్త పెద్ద స్థాయిలో  చేయాలనుకున్నాను. అందుకే ‘ఆల్ అబౌట్ లవ్‌‌‌‌’ పేరుతో ఎన్జీవో పెట్టాను. ప్రేమను పంచడం, ప్రేమగా ఇతరులకు సాయ పడటమే మా సంస్థ లక్ష్యం. 

మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే మరింత చేస్తారేమో!

అమ్మో.. అలాంటి ఆలోచనలేవీ లేవు.  నేను నటిని.. ఎప్పటికీ నటిగానే ఉంటా.

ఇంతకీ పెళ్లెప్పుడు?

చాలా టైమ్ ఉంది. ప్రస్తుతం నేను నటనను ప్రేమిస్తున్నాను. కొన్నాళ్లపాటు దాన్నే ప్రేమిస్తాను. మిగతా విషయాల గురించి  టైమ్​ వచ్చినప్పుడు ఆలోచిస్తాను.  
- సమీర నేలపూడి