ధరణితో దొరలే లాభపడ్డరు : జస్టిస్ ఈశ్వరయ్య

ధరణితో దొరలే లాభపడ్డరు :  జస్టిస్ ఈశ్వరయ్య

ఖైరతాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ధరణి పెద్ద స్కామ్ అని హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. ధరణి వలన దొరలే లాభపడ్డారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు ఎటువంటి లబ్ధి కలుగలేదని తెలిపారు. ఆల్ ఇండియా బ్యాక్ వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందనుకుంటే .. అందుకు విరుద్ధంగా కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతోందన్నారు. అందువల్ల బీఆర్ఎస్, బిజేపీలను  ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేసిందని.. అందుకే కాంగ్రెస్ లోని  అగ్రకులాలను ఓడించి బీసీలను గెలిపించుకోవాలని కోరారు.