వాళ్లు పాకిస్తానోళ్లే.. ఆధారాలున్నాయ్: కాంగ్రెస్ నేత చిదంబరంపై అమిత్ షా ఫైర్

వాళ్లు పాకిస్తానోళ్లే.. ఆధారాలున్నాయ్: కాంగ్రెస్ నేత చిదంబరంపై అమిత్ షా ఫైర్

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన నిందితులు పాకిస్థాన్‎కు చెందిన వారేనా..? అందుకు ఏమైనా ఆధారాలున్నాయా అని కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలపై సెంట్రల్ హోం మినిస్టర్ అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‎పై లోక్ సభలో రెండో రోజు చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులు పాక్ నుంచే వచ్చారనేందుకు ఆధారాలున్నాయా అని చిదంబరం ప్రశ్నించారు. 

ఆయన పాకిస్థాన్‎కు మద్దతుగా మాట్లాడుతున్నారా..? భారత హోం శాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని.. పాకిస్థాన్‎ను కాపాడితే కాంగ్రెస్‎కు ఏం వస్తుందని ప్రశ్నించారు. కొందరు పాకిస్థాన్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలపై ధ్వజమెత్తారు. ఆపరేషన్ మహాదేవ్‎లో భారత సైన్యం మట్టుబెట్టిన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్థాన్‎కు చెందిన వారేనని.. అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చిదంబరం వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 

ఎన్ కౌంటర్లో హతమైన ఉగ్రవాదుల నుంచి పాకిస్థాన్‎లో తయారైన చాకెట్లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన నిందితులను అంతమొందిస్తే ప్రతిపక్షాలు సంతోష పడతాయనుకున్నాం కానీ.. వారిని చూస్తే హ్యాపీగా లేనట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎన్ కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల మతం చూసి బాధపడొద్దని ప్రతిపక్షాలపై సెటైర్ వేశారు.