
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలంటూ డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ సోమవారం పాల్వంచలోని కేఎస్ఎం కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి డీఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ మాట్లాడారు. పెండింగ్లో ఉన్న దాదాపు రూ.8,600 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలన్నారు.
ఫీజుల చెల్లింపులలో జాప్యాన్ని నిరసిస్తూ త్వరలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకం బిల్లులను చెల్లించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో నేతలు వీరభద్రం, సాయికుమార్, సూర్య ప్రకాశ్, శ్రీకాంత్, రాం చరణ్ పాల్గొన్నారు.