
ప్రతిరోజు ఎంతో మంది భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు. రైల్వే ద్వారా ఒకచోట నుండి మరో చోటుకి ప్రయాణించాలంటే టికెట్ బుకింగ్ తప్పనిసరి. అయితే ఈ టికెట్ బుకింగ్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు లేకుండా ప్రయాణికులు మరింతగా సులభంగా ప్రయాణించాడనికి ఇండియన్ రైల్వే (IR) ఎప్పటికప్పుడు కృషి చేస్తుంటుంది. అయితే ఇందులో భాగంగా ట్రైన్ టికెట్ బుకింగ్ ప్రాసెస్ ఇంకా సులభం చేయడానికి చర్యలు కొత్తగా చర్యలు చేపట్టింది.
అయితే తాజాగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) 2.5 కోట్లకు పైగా యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. దీనికి కారణం జూలై 25న రాజ్యసభలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ టికెట్ బుకింగ్ వ్యవస్థలో జరిగే అక్రమాలను అరికట్టడానికే IRCTC 2.5 కోట్లకు పైగా యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసిందని అన్నారు.
అక్రమాలు లేకుండా దుర్వినియోగాన్ని నిరోధించడానికి రైల్వే తీసుకుంటున్న చర్యల గురించి వివరాలను కోరుతూ రాజ్యసభ సభ్యుడు AD సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ విధంగా సమాధానమిచ్చారు.
భారతీయ రైల్వేలు చేపట్టిన కార్యక్రమాలు:
*రిజర్వ్ చేసిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో లేదా కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన బుక్ చేసుకోవచ్చు. అంటే మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు. ప్రస్తుతం, మొత్తం టిక్కెట్లలో దాదాపు 89% ఆన్‌లైన్ మోడ్ ద్వారా బుక్ అవుతున్నాయి.
*ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టం (PRS) కౌంటర్లలో డిజిటల్ మోడ్‌ల ద్వారా పేమెంట్స్ చేసే సౌకర్యం కల్పించారు.
*01-07-2025 నుండి తత్కాల్ పథకం కింద టిక్కెట్లను ఆధార్ ద్వారా మాత్రమే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) వెబ్‌సైట్/యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
*తత్కాల్ రిజర్వేషన్ మొదటి 30 నిమిషాలలో ఏజెంట్లు బుక్ చేసుకోకుండా నిషేధించారు.
*రైళ్ల వెయిటింగ్ లిస్ట్ స్టేటస్ తప్పకుండా పర్యవేక్షిస్తారు అలాగే ప్రయాణికుల డిమాండ్ బట్టి స్పెషల్ ట్రైన్స్ నడిపిస్తారు. అలాగే అవసరమైతే రైలు బోగీలను పెంచుతాయి.