
తెలంగాణ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మండలాల్లో రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో ఇన్ ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి కలెక్టర్ తో కలిసి అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. కొత్త రేషన్ కార్డ్ ల కోసం తెలంగాణ ప్రజలు 10 సంవత్సరం నుంచి ఎదురు చూశారు. ముఖ్యమంత్రి రేవంత్ తెలంగాణ ప్రజల సమస్యలు మీద దృష్టి సారిస్తున్నారు. అందుకే రేషన్ కార్డ్ లు, డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వం రేషన్ లో దొడ్డు బియ్యం ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం సన్న బియ్యం కోసం 9 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది. మహిళల కోసం ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో పథకాలు ఇస్తున్నారు. గతంలో మహిళలకు 25 పైసలు వడ్డీ రుణం ఇచ్చే వారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వడ్డీ లేని రుణాలు ఇస్తున్న తీరును ఇతర రాష్ట్రాలు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి అనుసరిస్తున్నాయి. సిద్దిపేట అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తాను అని రేవంత్ రెడ్డి అన్నారు.