ఇసుక లారీల ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలి : సీపీఎం

ఇసుక లారీల ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలి : సీపీఎం
  •     సీపీఎం ఆధ్వర్యంలో భద్రాచలంలో రాస్తారోకో

భద్రాచలం,వెలుగు: ఇసుక లారీల ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం భద్రాచలంలో గోదావరి బ్రిడ్జి వద్ద రాస్తారోకో చేపట్టారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలంలో  రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. తక్షణమే ఇసుక లారీలను నిలుపుదల చేయాలని డిమాండ్​ చేశారు.

 అధికార, ప్రతిపక్ష నేతలంతా ఇసుక కాంట్రాక్టర్లతో లాలూచీ పడి నియోజకవర్గ అభివృద్ధిని తుంగులో తొక్కుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి  వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి ఆరోపించారు. ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడాలని కోరారు. రోడ్ల రిపేర్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బండారు శరత్​బాబు, వైవి రామారావు, సంతోష్​కుమార్​, సీతా లక్ష్మీ, నాదెళ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు.